Sunday, 24 July 2011

కూచిపూడిలో నాట్యశాల భవననిర్మాణం

                          కూచిపూడిలో నాట్యశాల భవననిర్మాణం
                కూచిపూడి నాట్యం జన్మ స్థలమైన కూచిపూడి గ్రామంలో ఉన్న శ్రీ సిద్ధేంద్రయోగి కూచిపూడి నాట్య కళాపిటంలో నలభై ఐదు లక్షల వ్యయంతో నాట్యశాల భవన నిర్మాణం చేపడుతున్నట్లు కేంద్ర పర్యాటక సహాయ డైరెక్టర్ జనరల్ డి.వెంకటేశన్ తెలిపారు. శనివారం  కూచిపూడికి వచ్చిన ఆయన ఇక్కడ కళాపీటాన్నిపరిశీలించారు. వారం రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారు. పర్యాటకుల కోసం శ్రీకాకుళం, ఘంటశాల వంటి ప్రాoతాలకు కేంద్రంగా కూచిపూడిని తీర్చిదిద్దుతామని వెల్లడించారు. 

No comments:

Post a Comment