దేశం కోసం చిన్నతనంలోనే అసువులు బాసిన మహనీయులు సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు నేటి యువతకు ఆదర్శప్రాయులు. స్వరాజ్యం నా జన్మ హక్కన్న బాల గంగాధర్ తిలక్ నినాదాన్ని నిజం చేసేందుకు విప్లవ వీరులుగా మారి తెల్లవారి గుండెల్లో నిద్రపోయిన భారత స్వాతంత్ర్య సమరయోధులు. పార్లమెంటు పై బాంబుల దడి చేసి... ఈ దేశంలో మనం ఇంక ఎక్కువ కాలం పరిపాలన చేయలేమని ఆంగ్లేయులు అనుకునేలా చేసిన మహనీయులు సర్దార్ భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ లు. భగత్ సింగ్, రాజగురు, సుఖదేవ్ 84వ వర్ధంతి సందర్భంగా వారికివే నా జోహార్లు.
సర్దార్ భగత్ సింగ్ చిత్ర పటానికి పూలమాలలు వేస్తూ
