Saturday, 11 April 2015

తిరుమల ప్రయాణం

తాతయ్యకు ఏడు సంవత్సరాల క్రితం ఆరోగ్యం బాగాలేనప్పుడు నాన్నగారు స్వామికి మొక్కుకున్నారు. తాతయ్యకు ఆరోగ్యం కుదుట పడితే కుటుంబ సమేతంగా తిరుమల వస్తామని నాన్న అప్పుడు అనుకున్నారు. దేవుని దయవల్ల తాతయ్యకు ఆరోగ్యం మెరుగుపడింది. అప్పటి నుంచే తిరుమల వెళ్లేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన స్వామి దర్శనం చేసుకోవడం సాద్యం కాలేదు. ఐతే అనుకోకుండా నా ;పది పరీక్షలు ముగిసిన రోజే నాన్న తిరుమలకు ప్రయాణం కట్టించారు. తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ, బాబాయి, నేను, తమ్ముడు, చెల్లి మిల్కీ ఈ నెల తొమ్మిదో (09.04.2015) తేదిన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్ళాము. ఈ రోజే నా పదవ తరగతి పరీక్షలు మధ్యాహ్నం పూర్తి అయ్యాయి. రాత్రి శేషాద్రి ఎక్స్ ప్రెస్ లో తిరుమల బైలుదేరాము. పదో తేది ఉదయం ఆరు గంటలకు తిరుపతి చేరాము. కొండపైన తిరుమలకు వెళ్లేందుకు నాన్నగారు జీపు మాట్లాడారు. విజయవాడలోనే నాన్నగారు తిరుమలలో గదిని బుకింగ్ చేయడంతో ఇబ్బంది లేకుండా వసతి గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకున్నాము.  తాతయ్య, నాయనమ్మ, నాన్నగారు, బాబాయి, తమ్ముడు స్వామి వారికీ మొక్కుగా తలనీలాలు సమర్పించారు. అమ్మ నేను చెల్లి స్వామికి మూడు కత్తెర్ల ఇచ్చాము. ఐతే తలనీలాలు సమర్పించేందుకు గంటన్నరకు పైగా పట్టింది. భక్తుల రద్ది లేనప్పటికి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఆలస్యమైంది. ఆ తర్వాత నాన్నగారు తమ్ముడుకి తెచ్చిన పట్టు పంచ తాతయ్య కట్టారు. తమ్ముడు పంచ కట్టుకోవడం ఇదే తొలిసారి కావడంతో కొంచెం ఇబ్బంది పడిన పంచ చాల చాలా బాగుంది. అలానే తాతయ్యకు, బాబాయి కి కూడా నాన్నగారే పట్టు పంచలు తెచ్చారు. బాబాయి కి కూడా తాతయ్యే పంచ కట్టారు. నాన్నగారు స్వయంగా తానే పంచ కట్టుకున్నారు. నేనైతే లంగా ఓణి కట్టుకుని దర్శనానికి బయలుదేరాము. ఇంటర్నెట్లో నాన్న 300 రూపాయల దర్శనం టికెట్లు బుక్ చేయడంతో మేము పది గంటల కల్లా వైకుంటమ్ క్యు కాంప్లెక్స్ 74 వద్దకు వెళ్ళగానే మమ్మలను దర్శనంకు అనుమతించారు. అక్కడ నుంచి చాలా దూరం నడిచాము. మధ్యలో నాలుగైదు చోట్ల తనికిలు చేసారు. చివరగా స్వామి ఆలయంలోకి వెళ్ళగానే ఎక్కడా లేని ప్రశాంతత పొందాను. ఎదురుగా స్వామివారి నిండైనా రూపాన్ని చూడగానే అన్నిటిని మర్చిపోయి అలా చూస్తూనే ముందుకు నడుచుకుంటూ వచ్చేసాము. ఎప్పుడు బయటకు వచ్చామో తెలియలేదు. అప్పుడు నాన్నగారు తీర్ధం ఇప్పించి ఆనందనిలయం పక్కనే కొంచెం సేపు కుర్చోపెట్టారు. శ్రీ వారికి భక్తులు కానుకలుగా సమర్పించే డబ్బులు లెక్కించే పరకామణి చూసాను. అక్కడి నుంచి కొంచెం ముదుకు వస్తే ఆనందనిలయం పై ఉన్న విమాన వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకుని నాలుగు అడుగులు వేస్తే స్వామి వారి హుండీ ఉంది. హుండీ చుట్టు ప్రదక్షిణ చేసి కానుకలు అందులో వేసి ఆనంద నిలయం గోపురాన్ని చూసి మరోసారి దర్శనం చేసుకునే భాగ్యం కల్పించమని స్వామిని మనసారా కోరుకుని బయటకు అదుగులు వేసాము. ఆనందనిలయం దాటి బయటకు రాగానే స్వామి వారి ఉచిత ప్రసాదం కట్టె  పొంగలి పెట్టారు. చాలా రుచిగా ఉంది... నాకు బాగా నచ్చింది. బయటకు వస్తుంటే గోపురం పక్కనే శ్రీ కృష్ణదేవరాయలు ఆయన సతిమణులుచిన్నమదేవి  తిరుమలదేవి విగ్రహాలు కనిపించాయి. స్వామి వారి సేవలో తరించిన చక్రవర్తి అయన దేవేరులకు నమస్కారం చేసి బయటకు వచ్చేసాము. అక్కడి నుంచి నాన్నగారు లడ్డు ప్రసాదం కోసం వెళ్ళగా నేను తాతయ్య బాబాయి నాయనమ్మ అమ్మ తమ్ముడు అదనపు లడ్డు ప్రసాదం కోసం క్యూలో నిలబడి తల రెండు లడ్లు తెచ్చాము. తర్వాత అన్న ప్రసాదం కోసం బయలుదేరాం. పైన ఎండా కింద బండ ఉండటంతో సలసల కాలుతున్న బండలపైనే కొద్దిగా నడిచాము.. అప్పుడు చూడాలి మా పాట్లు... ఓ రకంగా అందరు బండలపైన నాట్యం చేసుకుంటూ ముందుకు పరుగులు తీశాము. అబ్బా... కాళ్ళు మాడిపోయాయి. అన్న ప్రసాదం స్వికరించిన తర్వాత మాకు తెలిసింది అన్న ప్రసాద వితరణ  ప్రారంభించి 30సంవత్సరాలు అయిందని. అక్కడ నుంచి బయటకు రాగానే బాబాయి చెల్లికి ఓ దండ కొన్నారు. రేట్లు చాలా  ఎక్కువగా ఉన్నాయి. అప్పటికే మేము అలసిపోయము. దీంతో గది వరకు నడిచే పరిస్థితి లేకపోవడంతో నాన్నగారు కారు మాట్లాడి తీసుకెళ్ళారు. అందరం అయిదు గంటల వరకు విశ్రాంతి తీసుకుని కొండ దిగాము. నేరుగా అలివేలు మంగాపురం వెళ్లి అమ్మ వారి దర్శనం చేసుకున్నాం. అక్కడ నాకు రంగనాధస్వామి అవతారానికి సంబదించి పూల మాల నాన్న కొన్నారు. అప్పటికే ట్రైన్ సమయం దగ్గర పడటంతో వేగంగా తిరుపతి వచ్చి భోజనం ప్యాకెట్లు తెచ్చుకుని రైల్వే స్టేషన్ లో అడుగు పెట్టాము. మేము ఎక్కాల్సిన తిరుమల ఎక్స్ ప్రెస్ ఒకటో నెంబర్ ప్లాట్ ఫారం పై సిద్దంగా ఉంది. వెంటనే మా బోగీలు చూసుకుని తిరుమల ప్రయాణం ముగించుకుని రైలు ఎక్కేసాము. మాతో తెచ్చుకున్న భోజనం చేసి ఎవరి బెర్తులు వాళ్ళు ఎక్కి నిద్ర పోయాము. తెల్లవారు జామున రెండు గంటలకు బాబాయి మిల్కీ తెనాలిలో దిగి వెళ్లారట... మేము నాలుగు గంటలకు ఇంటికి చేరుకున్నామని అమ్మ చెప్పింది. ఎందుకంటే నేను అప్పుడు నిద్రపోయాను... ఇంటికి ఎప్పుడు వచ్చామో కూడా నాకు తెలీదు కనుక.
తిరుమల కొండ పైకి వెళ్లేందుకు అలిపిరి వద్ద బస్సు మార్గం ప్రవేశ ద్వారం 




కొండపై సహజంగా ఏర్పడిన గరుడ పక్షి ఆకారం 


తిరుమల కొండపై జింకల పార్కు వద్ద తమ్ముడు కోమల భార్గవ 

జింకల పార్కు వద్ద బాబాయి మిల్కీ తమ్ముడు నేను 



అలిపిరి నుంచి కనిపించే తిరుమల కొండ అందమైన దృశ్యం 

కొండపై బస్సులో వెళ్ళేటప్పుడు కనిపించే దృశ్యాలు 

మేఘాలలో కలసిపోయిన తిరుమల కొండ దరి 



తిరుమల కొండపై కనిపించిన సుందర దృశ్యం 



జింకలు 








జింకల పార్కు వద్ద బాబాయి మిల్కీ తమ్ముడు నేను



No comments:

Post a Comment