Thursday, 28 November 2013

కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారికి కేంద్ర సంగీత నాటక అవార్డు


ప్రముఖ కూచిపూడి నాట్యాచార్యులు శ్రీ చింతా సీతారామాంజనేయులు గారికి కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కేంద్ర సంగీత నాటక అవార్డును 2013 సంవత్సరానికి ప్రకటించింది. 1922 సెప్టెంబర్ 19న కృష్ణా జిల్లా కూచిపూడి అగ్రహారంలో కూచిపూడి సాంప్రదాయ కుటుంబంలో చింతా నారాయణమూర్తి, సీతమ్మ దంపతులకు జన్మించారు. అలనాటి ప్రముఖ గురువులైన  వేదాంతం పార్వతీశం వద్ద నాట్యం అభ్యసించిన అయన గత ఏడు దశాబ్దాలుగా కూచిపూడి నాట్యాన్ని వేలాది మందికి నేర్పించి కూచిపూడి ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరింపచేశారు. భామాకలాపంలో సత్యభామగా... ఉషా పరిణయంలో ఉషగా, ప్రహ్లాద యక్షగానంలో లీలావతిగా నాట్యం చేయడంలో చింతా  సీతారామాంజనేయులు ప్రఖ్యాతి గాంచారు.ఆయన 1952 నుంచి 1979 వరకు కూచిపూడి శ్రీ సిద్దేంద్ర కళాక్షేత్రంలో నాట్యాచార్యులుగా, ఆ తర్వాత నాగార్జునసాగర్లోని జవహర్ బాలభవన్ లో 2006 వరకు శిక్షణ ఇచ్చారు. సాగరసౌధం, భక్తకన్నప్ప, భీష్మ ప్రతిజ్ఞ, మనభారతం - మహాభారతం వంటి పలు నృత్య రూపకాలను మలిచారు. లెక్కకు మిక్కిలి అవార్డులు సత్కారాలు పొందారు.  సీతారామాంజనేయులకు తాజాగా కేంద్ర ప్రకటించిన అవార్డును త్వరలో భారత రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జి ప్రదానం చేస్తారు. తామ్ర పత్రంతో పాటుగా లక్ష రూపాయలు నగదును అందిస్తారు. 

No comments:

Post a Comment